News March 15, 2025
నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందించాలి: కలెక్టర్

నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. శనివారం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లాకలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ తిపేంద్రనాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగన్న, హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఉన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆమోదం జరిగిందని, నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు.
Similar News
News March 16, 2025
జుట్టు రాలుతుందా ? ఈ చిట్కాలు పాటించండి..!

విటమిన్ ‘D’ లోపం వల్ల జుట్టు రాలడం, పొడిబారటం, తెల్లగా మారటం జరుగుతుంది. గుడ్లు, మష్రూమ్ తినడంతో పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. క్యారట్ ,చిలగడ దుంపల వల్ల ‘ఎ’ విటమిన్ లోపం లేకుండా చూడవచ్చు. బాదం, పొద్దుతిరుగుడు గింజలు జుట్టు రాలడాన్ని నియంత్రించే పోషకాల్ని ఇస్తాయి. ఒత్తిడి కూడా వెంట్రుకలు రాలడానికి ఓ కారణం కాబట్టి మెడిటేషన్, యోగా చేస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు రాలే సమస్యను నియంత్రించవచ్చు.
News March 16, 2025
పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్సైట్లో నామినేషన్లు అప్లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
News March 16, 2025
మస్క్ కుమారునికి సహాయం చేసిన ట్రంప్

మస్క్ కుమారుడిని ట్రంప్ హెలికాప్టర్ ఎక్కిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ఫ్లోరిడాలోని తన ఇంటికి బయలుదేరగా ఆయనతో పాటు మస్క్ కుమారుడు వెళ్లాడు. ఆ ఛాపర్లోనికి ఎక్కడానికి పిల్లాడు ఇబ్బంది పడగా ట్రంప్ అతనికి సహాయం చేశారు. ఈ చిత్రాన్ని మస్క్ రీపోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా టెస్లా అధినేత తన కుమారున్ని USA అధికార కార్యక్రమాలకు వెంట తీసుకెళుతున్న సంగతి తెలిసిందే.