News March 10, 2025
నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసిన మిలియన్ మార్చ్: హరీశ్ రావు

ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మిలియన్ మార్చ్ నెరవేర్చిందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ లో పేర్కొన్నారు. మిలియన్ మార్చ్ నిర్వహించి ఈరోజుకు 14 ఏళ్లు అవుతుండగా జల మార్గం ద్వారా ట్యాంక్ బండ్ చేరుకున్న ఫోటోను హరీశ్ రావు పోస్ట్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన పోరాటానికి, తెగువకు సెల్యూట్ చెప్పారు.
Similar News
News March 10, 2025
కరీంనగర్: వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: RTC JAC

కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ అంశాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈ.వెంకన్న తదితరులున్నారు.
News March 10, 2025
KNR జోన్ రీజనల్ మేనేజర్లతో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం

KNR బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో KNR జోన్ పరిధిలోని అన్ని రీజియన్లకు సంబంధించిన రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్స్, KNR, WGL, NZB డిపో మేనేజర్లు, అధికారులతో KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, ఇటీవల KNR, NZB, WGL లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సుల పనితీరును సమీక్షించారు.
News March 10, 2025
KMR: మహిళలు, పురుషులతో పోటీ పడాలి: కలెక్టర్

సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళలు.. పురుషులతో పోటీ పడాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.