News February 27, 2025
నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.
Similar News
News February 27, 2025
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: మాధవ్

APలో YCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. తాను న్యాయ నిపుణుల సలహా తీసుకుని పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సూపర్-6 హామీలపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
News February 27, 2025
అత్యంత వివాదాస్పద చిత్రం ఇదే!

భారత సినీ పరిశ్రమలో ఎన్నో వివాదాస్పద సినిమాలున్నాయి. కానీ, పియర్ పాలో పసోలిని డైరెక్ట్ చేసిన ‘120 డేస్ ఆఫ్ సొదొమ్’ మాత్రం అత్యంత వివాదాస్పదమైంది. దీన్ని 150 దేశాలు బ్యాన్ చేశాయి. ఇది 1975లో ఇటాలియన్‌లో విడుదలైంది. వరల్డ్ వార్-2 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన కొద్దిరోజులకే డైరెక్టర్ హత్యకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన పిల్లలపై లైంగిక వేధింపులు, క్రూరంగా హింసించిన దృశ్యాలను ఇందులో చూపించారు.
News February 27, 2025
నెల్లూరుకి కేంద్రం బాధ్యతను అప్పగించింది : వీసీ

వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025ను జిల్లా స్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ, ఎన్ఎస్‌ఎస్, నెల్లూరు నెహ్రూ యువ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగించిందని వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025 కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీసీ సూచించారు.