News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.
Similar News
News April 4, 2025
యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
News April 4, 2025
నరసన్నపేట: లారీ యాక్సిడెంట్.. తాపీమేస్త్రి మృతి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ తాపీమేస్త్రి మృతి చెందారు. నరసన్నపేట మండలం పొలాకి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు(49) మధురవాడలో మరో వ్యక్తితో పని నిమిత్తం బైక్‌పై బయలుదేరారు. మారికవలస హైవేపై ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ప్రభాకర్ రావు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
News April 4, 2025
హనుమకొండ: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.