News March 30, 2025
నిర్మల్: ఉగాది వేడుకల్లో మాజీ మంత్రి

నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఉగాది వేడుకలను ధనరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జానపద జాతర సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక జానపద పాటలు, నృత్యాలు విశేషంగా అలరించాయి. రేలారే రేలా ఫెమ్ రవి బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 3, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 3, 2025
మహబూబ్‌నగర్: ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.
News April 3, 2025
దివ్యాంగులందరికీ యూడిఐడి స్మార్ట్ కార్డులు: MHBD కలెక్టర్

దివ్యాంగులందరికీ యూడిఐడి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం వైకల్య ధ్రువపత్రాన్ని సదరం శిబిరంలో తగు వ్యాలిడిటితో కాగితరూపంలో ఇస్తున్నారన్నారు. ఇక ఈ సమస్యలు లేకుండా యూడిఐడి నంబరును కేటాయించి స్మార్ట్ కార్డులు జారీచేయాలని కేంద్రం నిర్ణయించినట్లు, ఇందుకోసం ప్రత్యేకంగా https://www.swavlambancard.gov.in పోర్టల్ రూపొందించిందన్నారు.