News October 3, 2024
నిర్మల్: కల్లులో కలిపే కెమికల్స్ పట్టివేత

నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారీగా కల్లులో కలిపే రసాయనాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీలోఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.43 లక్షల విలువైన 26 సంచుల క్లోరల్ హైడ్రేడ్, మూడు కిలోల ఆల్ఫోజోలం సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 11, 2025
గుడిహత్నూర్‌లో శిశువు మృతదేహం కలకలం

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
News March 11, 2025
ADB: రూ.75.31లక్షల కరెంట్ బిల్లు పెండింగ్

జిల్లాలోని 447 పాఠశాలల్లో మొత్తం రూ.75.31 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. అవి పాత కరెంటు బిల్లులు కావడంతో చెల్లించలేదని, నిధులు మంజూరైనప్పటి నుంచి రెగ్యులర్ బిల్లు చెల్లిస్తున్నామని పలువురు HMలు వివరించారు. కాగా నెల రోజుల్లో బకాయిలు పూర్తి చేయకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.
News March 11, 2025
ADB: కనిపించకుండా పోయి.. శవమై తేలాడు

మావలలో ఓ వ్యక్తి <<15710393>>మృతదేహం<<>> లభ్యమైన విషయం తెలిసిందే. అయితే మావల ఎస్ఐ గౌతమ్ వివరాల మేరకు.. మావలకు చెందిన షేక్ పర్వేజ్ (22) పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి.. రాత్రయినా తిరిగి వెళ్లలేదు. సోమవారం ఉదయం మావల ఎర్రకుంట చెరువులో శవమై కనిపించాడు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.