News February 27, 2025
నిర్మల్ : చెట్టుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం

నిర్మల్ గాంధీ పార్క్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాల్మీకీనగర్‌కు చెందిన దూదేకుల కాసిం(47) చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోగా గాయపడ్డారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు.
Similar News
News February 27, 2025
సిరిసిల్లలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓటింగ్

సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం జిల్లాలో ఇప్పటికే అధికారులు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 23,347 పట్టభద్రులు ఉన్నారు.
News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతా నగర్‌లో ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు భద్రతను ఏర్పాటుచేశారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
News February 27, 2025
వెబ్ ల్యాండ్ నుంచి ఎమ్మెల్యే ఆస్తుల తొలగింపు

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య జ్యోతమ్మ, తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సృజన పేరుతో ఉన్న భూములను మంగళవారం వెబ్ ల్యాండ్ నుంచి తొలగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజంపేట మండలంలో ఉన్న 30.13 ఎకరాల ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. మందపల్లి సర్వేనంబర్ 814-3లో 4 ఎకరాలు, 814-4లో 5 ఎకరాలు, 815-1,2 లో 8.79 ఎకరాలు, 816-2 లో 4.31 ఎకరాలు, ఆకేపాడు 56/8,9లో 8.03 ఎకరాలు.