News February 16, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1)జిల్లా అంతటా సేవాలాల్ జయంతి వేడుకలు2)ఖానాపూర్: బాలుడిపై దాడి చేసిన కోతులు3)భైంసా: ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్4)నిర్మల్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు5)సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మల్ ఎమ్మెల్యే

Similar News

News December 18, 2025

MNCL: సింగరేణి ఆవిర్భావ వేడుకలకు నిధులు

image

ఈ నెల 23న జరగనున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల నిర్వహణకు డివిజన్ల వారీగా యాజమాన్యం నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మందమర్రి డివిజన్‌కు రూ.60 వేలు, శ్రీరాంపూర్ డివిజన్‌కు రూ.60 వేలు, బెల్లంపల్లి డివిజన్‌కు రూ.50 వేలు, జైపూర్ ఎస్టీపీపీకి రూ.25 వేలు చొప్పున నిధులు కేటాయించారు.

News December 18, 2025

మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

image

“రాజీ మార్గమే – రాజ మార్గం” అనే నినాదంతో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. రాజీ పడదగ్గ నేరాలు, సివిల్ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతాయని ఆయన సూచించారు.

News December 18, 2025

రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే NBW.. కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

image

ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ నేడు ఆమోదించింది. కులం/మతం/వ్యక్తిని రెచ్చగొట్టే కామెంట్లకు 1-7ఏళ్ల జైలు, రూ.50వేల ఫైన్ విధిస్తామని బిల్లులో పేర్కొంది. రిపీట్ చేస్తే 2ఏళ్ల జైలు, రూ.లక్ష ఫైన్ వేస్తారు. నేర తీవ్రత ప్రకారం బాధితుడికి పరిహారమిచ్చే అవకాశమూ ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బిల్లు తెచ్చిందని BJP విమర్శించింది.