News February 5, 2025

నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

image

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.

Similar News

News March 14, 2025

బిక్కనూర్: రేపటి నుంచి సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

image

బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని ఉన్న దక్షిణ కాశీగా, పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 

News March 14, 2025

కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు. 

News March 14, 2025

ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

image

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.

error: Content is protected !!