News April 24, 2025

నిర్మల్: తల్లిదండ్రులను కోల్పోయిన ఆగని లక్ష్యం

image

ఖానాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల కళాశాల విద్యార్థిని తోకల ముత్తవ్వ అలియాస్ సుప్రియ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. BiPC ప్రథమ సంవత్సరంలో 429 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు లేకపోయినా పిన్ని, బాబాయిల సహకారంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివినట్లు తెలిపింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది. సరూర్నగర్లోని COEలో సీటు సాధించడంతో ప్రస్తుతం నీట్ శిక్షణ పొందుతోంది.

Similar News

News August 23, 2025

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

News August 23, 2025

సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.

News August 23, 2025

MBNR: రాజా ది గ్రేట్!

image

ఆయన తెలంగాణ మట్టికి అరుదైన గౌరవం తెచ్చారు.. NASA Artemis మిషన్‌లో కమాండర్‌గా అద్భుత సేవలందించారు. ఫాల్కన్-9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయలుదేరిన మిషన్‌కు నేతృత్వం వహించి.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని పెంచారు. ఆయనే మహబూబ్‌నగర్ మూలాలున్న రాజాచారి. నేడు అంతరిక్ష దినోత్సవాన, ఇటువంటి శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణం యువతకు ప్రేరణనిస్తుంది.