News March 5, 2025
నిర్మల్: పకడ్బందీగా SSC పరీక్షలు :DEO

పకడ్బందీగా SSC పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో రామారావు తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న ఆంగ్ల పీరియడ్‌ను పరిశీలించారు. అక్కడ ప్రదర్శించబడిన గ్రాండ్ టెస్ట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పిలిచి, అన్ని విషయాల్లో వారి ప్రగతిని పరిశీలించారు.
Similar News
News December 17, 2025
ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఇబ్బందులు కలిగించి ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. బుధవారం ముధోల్, బాసర, తానూరు తదితర పోలింగ్ కేంద్రాలకు సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది, భద్రత సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారన్నారు.
News December 17, 2025
గొల్లపల్లి : పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

గొల్లపల్లి (M) ఇబ్రహీంనగర్, గొల్లపల్లి, పెగడపల్లి (M) బతికపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News December 17, 2025
జగిత్యాల: ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

జగిత్యాల జిల్లాలోని 6 మండలాలలో మూడో విడత జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది. క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది. ఇన్ని రోజులు కష్టపడ్డ తమకు ఫలితం ఎలా దక్కుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


