News April 23, 2025
నిర్మల్: పేదింటి అమ్మాయిలకు స్టేట్ ర్యాంకులు

పేద కుటుంబాల నుంచి వచ్చి గురుకులాల్లో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు నిర్మల్ అమ్మాయిలు. శాంతినగర్ గురుకుల బాలికల కళాశాలల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో అక్షయ 435, విజయలక్ష్మి, కీర్తన 433, వైష్ణవి 432 మార్కులు సాధించారు. ఎంపీసీలో శార్వాణి, శ్రీవల్లి 465, సంధ్యారాణి, వర్షిని 464, కీర్తన 463 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
Similar News
News April 23, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..అత్యధికంగా అచ్చంపేట, వంగూర్, పెద్దకొత్తపల్లి 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తెలకపల్లి 42.1, కొల్లాపూర్ 42.0, వెల్దండ 41.8, కారకొండ 41.5, ఉప్పునుంతల, పెంట్లవెల్లి 41.4, బిజినేపల్లి 41.3, కల్వకుర్తి 41.1, నాగర్ కర్నూల్ 40.9, కోడేరు 40.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 23, 2025
పర్వతాపూర్: భారీ మొత్తంతో చదువు‘కొనాలా’?

పర్వతాపూర్ అరోరా కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తమపై ఫీజుల భారం మోపుతోందని నిరసనకు దిగారు. తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. ఫీజు చెల్లింపుల్లో పారదర్శకత లేకపోవడం, చెల్లించిన రుసుములకు రసీదు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ప్రాంగణ నియామకాలు చేపట్టడం లేదని విద్యార్థులు గళమెత్తారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.
News April 23, 2025
సాగర్ కలుషితం తీరుతుందెప్పుడో!

HYDలోని హుస్సేన్ సాగర్ రోజురోజుకు కలుషితం అవుతోంది. ఇటీవలే PCB నిర్వహించిన వాటర్ క్వాలిటీ టెస్ట్ రిపోర్టులో ఇది వెల్లడైంది. ఖైరతాబాద్ STP, సంజీవయ్య పార్కు వద్ద BOD స్థాయి పరిమితికి మించి 86,92గా భారీగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీటి జీవరాశులు బతికేందుకు నీటిలో కరిగే ఆక్సిజన్ అవసరం. దీని స్థాయి రోజురోజుకూ అనేక ప్రాంతాల్లో తగ్గుతున్నట్లు PCB లెక్కల్లో తేలింది.