News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఖానాపూర్, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బయల్దేరుతుందని వెల్లడించారు.
Similar News
News December 19, 2025
పాలమూరు: బీసీల ప్రభంజనం.. 739 స్థానాలు కైవసం!

ఉమ్మడి పాలమూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 1,678 పంచాయతీల్లో 365 స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, అదనంగా 374 జనరల్ స్థానాల్లోనూ విజయం సాధించి మొత్తం 739 జీపీలను కైవసం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 193, నారాయణపేటలో 149, వనపర్తిలో 127, గద్వాలలో 149, నాగర్‌కర్నూల్‌లో 121 మంది బీసీ సర్పంచులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
News December 19, 2025
ఆదిలాబాద్: గ్రూప్-3లో రైతు బిడ్డ సత్తా

తలమడుగు మండలం అర్లి (కె) గ్రామానికి చెందిన కళ్ల సందీప్ గ్రూప్-3 ఉద్యోగ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. కళ్ల సువర్ణ – కృష్ణ దంపతుల కుమారుడైన సందీప్ రాష్ట్ర స్థాయిలో 202వ ర్యాంక్, జోనల్ స్థాయిలో 28వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలతో ఆయన ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో శ్రమించి ఈ విజయం సాధించడం పట్ల గ్రామస్థులు, బంధువులు హర్షం చేశారు.
News December 19, 2025
జెనోమిక్స్.. రూ.10వేల టెస్టు రూ.వెయ్యికే

వైద్యరంగంలో అతిపెద్ద విప్లవానికి రిలయన్స్ సిద్ధమవుతోంది. క్యాన్సర్ సహా భవిష్యత్తులో వచ్చే రోగాలను ముందే గుర్తించేందుకు వీలుగా ₹10వేల విలువైన జెనోమిక్స్ టెస్టును ₹వెయ్యికే అందించాలని యోచిస్తోంది. దీనివల్ల ముందుగానే జాగ్రత్త పడటానికి వీలవుతుంది. రక్తం/లాలాజలం/శరీరంలోని టిష్యూని ఉపయోగించి ఈ పరీక్ష చేస్తారు. జెనోమిక్స్‌తో సమాజంపై తమ ముద్ర వేస్తామని సంస్థ సీనియర్ అధికారి నీలేశ్ వెల్లడించారు.


