News March 5, 2025

నిర్మల్: బడులకు ల్యాప్‌టాప్‌లు వచ్చాయ్…!

image

జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన ల్యాప్‌టాప్‌లను మంగళవారం డీఈవో రామారావు ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక కాగా 17 పాఠశాలలకు టింకరింగ్ ల్యాబ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటి కింద 17 పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు వచ్చాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News March 5, 2025

సీసీ కుంట: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

image

సీసీకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అమరచింత మం. మస్థిపురానికి చెందిన గుండమ్మ(77) కురుమూర్తి స్వామి దర్శనానికి గతనెల 28న వెళ్లింది. ఆలయ పరిసరాల్లో అటుఇటు తచ్చాడుతూ పలువురికి కనిపించింది. ఇంతలోనే బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News March 5, 2025

ఐదు నెలల క్రితమే వివాహం.. ఇంతలోనే విషాదం 

image

కార్వేటినగరం(మం)లో విషాదం నెలకొంది. ఆళత్తూరు వాసి శ్రావణ్ తన ఫ్రెండ్ చెన్నకేశవులతో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకకు కొల్లాంగుట్టకు బైకు మీద వెళ్లారు. తిరిగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బైకును కొల్లాగుంట చెక్ పోస్ట్ సమీపంలో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రావణ్‌కు ఐదు నెలల క్రితమే వివాహం కాగా.. ఆమె గర్భిణి. 

News March 5, 2025

సూర్యాపేట: అంగన్ వాడీ కేంద్రాల్లో కొలువులు

image

సూర్యాపేట జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 61 టీచర్ పోస్టులు, 191 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

error: Content is protected !!