News January 10, 2025

నిర్మల్ : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు (కేజీబీవీ మినహా) ఈనెల 11 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని డీఈవో రామారావు తెలిపారు. అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయని తెలిపారు. ఈనెల 18న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు.ః

Similar News

News January 11, 2025

నిర్మల్: జనవరి 12న యువజన దినోత్సవం

image

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈనెల 12న నిర్మల్‌లో యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వివేకానంద చౌక్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

News January 11, 2025

ఉట్నూర్: ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి: సీఎం

image

ఆదివాసుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి వారు వివరించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసీ నాయకులు ఉన్నారు.

News January 11, 2025

సీఎంతో సమావేశంలో పాల్గొన్న నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.