News March 14, 2025

నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.

Similar News

News December 29, 2025

‘ఆరావళి’పై రేపు సుప్రీంలో విచారణ

image

<<18663286>>ఆరావళి పర్వతాల<<>> నిర్వచనంపై చెలరేగిన వివాదాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనం, అనుబంధ సమస్యల వివాదంపై ముఖ్యంగా విచారణ జరగనుంది. కాగా ఆరావళిలో మైనింగ్‌ <<18662201>>నిలిపివేస్తున్నట్లు<<>> కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

News December 28, 2025

కామారెడ్డి జిల్లాలో గ్రామ పాలన ఆఫీసర్స్ కమిటీ ఎన్నిక

image

గ్రామ పాలన ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ పిలుపుతో కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముదం చిరంజీవి ఆధ్వర్యంలో ఓటింగ్ విధానంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా వెంకటేశ్ ఎన్నికయ్యారు. కొత్త కమిటీ జిల్లా స్థాయిలో గ్రామ పాలన ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి పనిచేయనుంది.

News December 28, 2025

కామారెడ్డి: ఫిబ్రవరిలో జనసేన క్రియాశిలక సభ్యత్వాలు

image

కామారెడ్డి దేవి విహార్‌లో జనసేన జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జీవన్ నాయక్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో క్రియాశీలక సభ్యత్వాలు నిర్వహించాలని రవీందర్ చౌహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, కృష్ణ స్వామి, సుకదేవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.