News February 5, 2025
నిర్మల్ వైద్య కళాశాలలో JOBSపై UPDATE
నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో 52 ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా కళాశాల నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంటుందని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అధ్యక్సఉడు దుర్గం శేఖర్ తెలిపారు. ఈనెల 5 నుంచి 8 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్
బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.
News February 5, 2025
యువతిని బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడు అరెస్ట్
నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియాతో మాట్లాడారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. నిందితుడికి చెందిన రూ.కోటి 81 లక్షల విలువ గల ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా నిందితుడి ఫోన్‌లో ఎటువంటి వీడియోలు లభ్యం కాలేదన్నారు.
News February 5, 2025
MBNR: వివాహితపై లైంగిక దాడి
MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.