News April 2, 2025
నిర్మల్: సాంఘిక పరీక్షకు 12 మంది గైర్హాజరు: డీఈవో

ఎలాంటి పొరపాట్లు లేకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా ముగిశాయని డీఈవో రామారావు అన్నారు. బుధవారం తానూర్ మండలం బోసి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. నేడు జరిగిన సాంఘిక పరీక్షకు జిల్లావ్యాప్తంగా 9117 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 12 మంది పరీక్ష రాయలేదని చెప్పారు.
Similar News
News April 8, 2025
MNCL: పట్టభద్రుల గొంతుకగా నిలుస్తా: MLC అంజిరెడ్డి

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్- కరీంనగర్ గ్రాడ్యుయేట్ బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పట్టభద్రుల గొంతుకగా నిలుస్తానని తెలిపారు.
News April 8, 2025
నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News April 8, 2025
నిర్మల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్ కండక్టర్

నిర్మల్ డిపోకు చెందిన బస్ కండక్టర్ ఆర్.గంగాధర్ నిజాయితీని చాటుకున్నారు. పర్సు మరిచిపోయిన ప్రయాణీకుడి వివరాలు తెలుసుకోని అప్పగించాడు. నిర్మల్ నుంచి భైంసాకు వెళ్తున్న బస్సులో శివకుమార్ అనే వ్యక్తి పర్సును మరిచిపోయి దిగిపోయాడు. కండక్టర్ శివకుమార్ సీటులో ఉన్న పర్సును గమనించి ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణీకుడిని పిలిపించి పర్సును అందజేశాడు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ ను డిపో మేనేజర్ అభినందించారు.