News March 4, 2025

నిర్మల్: ‘సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

image

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు.

Similar News

News March 4, 2025

ముధోల్: ఇంట్లో పట్టపగలే బంగారం చోరీ

image

ముధోల్ మండలం వడ్తాల్ గ్రామంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. ఎస్ఐ సంజీవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భోజవ్వ తన కూతురి పెళ్లి కోసం బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన నగలను కొన్ని రోజుల క్రితం తీసుకువచ్చి ఇంట్లోని బీరువాలో దాచిపెట్టింది. కాగా సోమవారం దుండగులు 4 తులాల బంగారం, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 4, 2025

HYDలో శిరీషను చంపి డ్రామా!

image

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News March 4, 2025

కొయ్యూరు: భార్య కళ్లెదుటే భర్త మృతి

image

కొయ్యూరు మండలం నిమ్మలపాలెం సమీపంలో సోమవారం రోడ్డు<<15637815>> ప్రమాదం<<>> లో వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. వేనం గ్రామానికి చెందిన పాంగి భానుచందర్ తన భార్య జ్యోతితో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడి భానుచందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జ్యోతిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కళ్లెదుటే భర్త మృతి చెందడంతో ఆమె గుండెలవిసేలా రోధించింది. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెటుకున్నారు.

error: Content is protected !!