News April 21, 2025
నిర్మల్‌లో వడదెబ్బతో ఇద్దరు మృతి

వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం నిర్మల్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కురన్నపేట్ కాలనీకి చెందిన శంకర్(48), రాజు (42) ఆదివారం పోచమ్మ పండుగ ఉండటంతో డప్పు కొట్టడానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చాక నీరసంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందారు. మృతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని.. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News April 21, 2025
బాబా సిద్దిఖీ కుమారుడిని చంపేస్తామని వార్నింగ్

గతేడాది ముంబైలో హత్యకు గురైన బాబా సిద్దిఖీ కుమారుడు, NCP నేత (అజిత్ పవార్ వర్గం) జీషన్ సిద్దిఖీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. ‘నిన్నూ మీ నాన్న లాగే చంపేస్తాం. రూ.10కోట్లు ఇవ్వు. ప్రతి 6 గంటలకు ఓసారి ఇలాంటి మెయిల్ పంపుతూనే ఉంటాం’ అని వార్నింగ్ ఇచ్చారని ముంబై పోలీసులు వెల్లడించారు. కాగా సిద్ధిఖీని గతేడాది అక్టోబర్ 12న కాల్చి చంపారు. దీనికి తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
News April 21, 2025
బాపట్ల జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో బాపట్ల జిల్లాలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 103 పరీక్షా కేంద్రాల్లో 16,361 మంది రెగ్యులర్, ప్రైవేటు, మరో 438 మంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ.. ఒక్కో సెకనూ గంటలా మారింది. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
News April 21, 2025
పురుషులు ఈ పదార్థాలు తింటే..

పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే శుక్రకణాల నాణ్యత తగ్గుతుందని తెలిపారు. రోజూ విపరీతంగా మద్యం సేవిస్తే వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న క్రీమ్, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.