News April 22, 2025
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: SP

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ స్వీకరించి బాధితుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
Similar News
News April 22, 2025
S.N పాడు: అధ్యాపక పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు

సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News April 22, 2025
ప్రకాశం: విద్యార్థుల కోసం ఇంటి బాట పట్టిన ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఇంటి బాట పడుతున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలలో తిరుగుతూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయింది.
News April 22, 2025
ఉపాధి హామీ పని దినాలు తగ్గించిన కేంద్రం

TG: కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనిదినాలకు తగ్గించింది. గత ఏడాది రాష్ట్రానికి 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈ సారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం రూ.2,708.3 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనున్నారు. కాగా పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.