News June 6, 2024

నీట్‌లో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

image

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆదర్శ కళాశాల, పాతపట్నంలో ఇంటర్ బైపీసీలో 953 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకే పేరు తెచ్చిన బండి గౌతమి 2024 నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 925వ ర్యాంకు, రీజనల్ స్థాయిలో 288వ ర్యాంకు సాధించింది. దీంతో ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని ప్రిన్సిపల్ రత్నకుమారి అన్నారు. గౌతమికి కళాశాల తరుపున అభినందనలు తెలిపారు.

Similar News

News November 30, 2024

శ్రీకాకుళం: PG సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు సంబంధించి (ఆర్ట్స్‌ & సైన్స్) 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. పరీక్షలు డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు.

News November 30, 2024

ఎచ్చెర్ల: పింఛను సొమ్ము కోసం దాడి

image

పింఛను సొమ్ము కోసం సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన  ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాజీవ్ స్వగృహ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుని కథనం..ఎస్ఎం పురం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ విష్ణు ఎచ్చెర్ల SBIలో రూ. 24 లక్షలకు పైగా డ్రా చేసుకుని వస్తున్నారు. గమనించిన ఇద్దరు ఆగంతకులు బైకు ఆపే ప్రయత్నం చేసి, రాడ్డుతో దాడి చేయగా తప్పించుకుని సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

News November 30, 2024

అరసవిల్లి గుడికి రూ.100 కోట్లు ఇవ్వండి: మంత్రి

image

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం చరిత్రను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రసాద్ పథకం కింద అరసవిల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రూ.100 కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు.