News April 9, 2024
‘నెక్కొండ ఫలుదా’ ఘటన.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల రిపోర్ట్ ఇదే!
నెక్కొండలో ఇటీవల ఫలుదాలో ఓ వ్యాపారి వీర్యం, మూత్రం కలుపుతున్నట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వెంటనే సదరు వ్యాపారిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఐస్‌క్రీం బండిలోని పదార్థాలను HYDలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదికను ఫుడ్ సేఫ్టీ అధికారులు విడుదల చేశారు. అందులో ఎలాంటి వీర్యం, మూత్రం ఆనవాళ్లు లేవని నిర్ధారించినట్లు WGL జోన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అమృతశ్రీ క్లారిటీ ఇచ్చారు.
Similar News
News December 28, 2024
వరంగల్‌కు నాస్కామ్ శుభవార్త!
వరంగల్‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
News December 28, 2024
ముందస్తు చర్యలతో నేరాలు అదుపు: వరంగల్ సీపీ
నేరాల నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలతో నేరాలు తగ్గాయని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. నేరాలకు సంబంధించి నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయడంతో పాటు కోర్టుకు తగిన సాక్షాధారాలు సమర్పించడంతో కమిషనరేట్ పరిధిలో దాదాపు 2,462 మందికి శిక్షలు విధించినట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అధికారులు పాల్గొన్నారు.