News March 1, 2025

నెన్నెలలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో నెన్నెల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంతోష్‌ తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి బైక్ పై తన సొంతూరు ఎల్లారం వైపు వెళ్తుండగా బొప్పారం సమీపంలోని నర్సరీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కాగా ఆయన భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News March 2, 2025

ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

image

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

News March 2, 2025

నాగర్ కర్నూల్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

image

✓నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహణ.
✓నాగర్ కర్నూల్ జిల్లాలో రేపటి నుండి రంజాన్ మాస ఉపవాస అధ్యక్షులు ప్రారంభం.
✓జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.
✓వంగూరు మండలం కొండారెడ్డిపల్లి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత పదవి విరమణ.
✓ముస్లిం సోదరి సోదరీ మణులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

News March 2, 2025

HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

అంబర్‌పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!