News July 27, 2024

నెల్లూరు KNR స్కూల్ లో తప్పు ఎవరిది?

image

నెల్లూరు స్కూల్ లో గోడ కూలి మహేంద్ర మృతి చెందిన ఈ ఘటనలో తప్పు ఎవరిది? నాడు-నేడు పనులను నాసిరకంగా చేపట్టడం తోపాటు నిధులు ఇవ్వక అర్ధంతరంగా పనులు ఆపించిన గత ప్రభుత్వ పాలకులదా? సగం పనులు జరిగిన భవనం వద్దకు పిల్లలను వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించిన ఉపాధ్యాయులదా!? ఇలా తప్పు ఎవరిదైనా ఆ తల్లికి మాత్రం పుత్రశోకం మిగిల్చింది. ఈ నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు కోరాయి.

Similar News

News March 11, 2025

నెల్లూరు: సరైన బిల్లులు లేని 4 కేజీల బంగారం స్వాధీనం

image

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు సీఐ కే.నరసింహారావు, DCTO కే. విష్ణు రావు తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3 కోట్ల 37 లక్షల విలువైన 4 కేజీల 189 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కారును జీఎస్టీ అధికారులకు అప్పగించారు.

News March 11, 2025

నెల్లూరు: కలెక్టరేట్‌లో ఉచితంగా భోజనాలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లో జరిగే PGRSకు ప్రజలు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. భోజన సమయం అయ్యేసరికి చేతిలో ఉండీ, లేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ ఆనంద్ అర్జీదారులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఆనంద్‌ను ప్రజలు అభినందిస్తున్నారు.

News March 11, 2025

నెల్లూరు: నీటిపారుదల పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షలు మంజూరు

image

జాతీయ పోషకాహార భద్రత పథకంలో భాగంగా చిరుధాన్యాలు, నీటిపారుదల కొరకు పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షల నిధులు మంజూరైనట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలో 70 వేల హెక్టార్లలో రైతుకు ఐదు ఎకరాల చొప్పున రూ.15 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.

error: Content is protected !!