News April 24, 2024

నెల్లూరు: ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల విలువ రూ. 22 లక్షలు

image

నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.డీ ఖలీల్ అహ్మద్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 22.18 లక్షలు ఉన్నట్లు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఖలీల్ పేరుపై రూ.16.25 లక్షలు, ఆయన సతీమణి పేరుపై రూ. 4.26 లక్షలు, కుమారుడి పేరున రూ. 1.67 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపించారు. అప్పులు, కేసులు లేవు.

Similar News

News February 5, 2025

రామయ్యపట్నం గురించి రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ బీద

image

రామయ్యపట్నం లో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో మంగళవారం ఎంపీ బీద మస్తాన్ రావు ప్రశ్నించారు. దీనికి కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిస్తూ ప్రాజెక్టు వ్యయం 96,862 కోట్ల రూపాయలని, ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 6000 ఎకరాల భూమిలో నెల్లూరు జిల్లా రామయ్యపట్నం ఓడరేవులు గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు అంగీకరించబడింది తెలిపారు

News February 5, 2025

నెల్లూరు యువకుడికి సీఎం చంద్రబాబు ప్రశంస

image

ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మెరిసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించిన కర్రి సాయి పవన్ (రాజమండ్రి), షేక్ గౌస్ (నెల్లూరు), కానో‌స్లాలోమ్ C1 మహిళల విభాగంలో కాంస్యం సాధించిన దొడ్డి చేతన భగవతికి (ఏలూరు) ఆయన అభినందనలు తెలిపారు. వారి విజయాల పట్ల గర్వంగా ఉందని CM సంతోషం వ్యక్తం చేశారు.

News February 5, 2025

లోక్‌సభలో నెల్లూరు ఎంపీ ఏంమాట్లాడారంటే?

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు పలు అంశాలపై ఆయన లోక్‌సభలో ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

error: Content is protected !!