News March 4, 2025
నెల్లూరు: ఇంటర్ పరీక్షకు 921 మంది గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్‌ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్‌ఐవో తెలిపారు.
Similar News
News March 5, 2025
బాలిక మిస్సింగ్.. గంటలోనే కాపాడిన పోలీసులు

నెల్లూరు నగరం ములుముడి వీధికి చెందిన మూడేళ్ల బాలిక ఆరుబయట ఆడుకుంటూ కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు చిన్న బజార్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ చిన్న బజార్ సీఐ ఆదేశానుపారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంట వ్యవధిలోనే తప్పిపోయిన ఆ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
News March 5, 2025
నెల్లూరు: విద్యుత్ సంస్థకు ఫిల్లర్ లైన్‌మెన్

నెల్లూరు విద్యుత్ భవన్‌లోని స్కాడా బిల్డింగ్‌లో లైన్‌మెన్ దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టౌన్ ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్ఈ వి.విజయన్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థకు లైన్‌మెన్, సిబ్బంది ఫిల్లర్ లాంటి వారని కొనియాడారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
News March 4, 2025
నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యంశాలు

☞ నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. 15 ఏళ్లు జైలు శిక్ష
☞ నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు
☞ మనుబోలు: స్వీట్స్‌తో శ్రీ విశ్వనాథ స్వామికి ఏకాంత సేవ
☞ ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలి: MLA ప్రశాంతి
☞ నెల్లూరు: చంద్రబాబుపై రైతు ఆగ్రహం
☞ ఉదయగిరి: సేల్స్ టాక్స్ అధికారుల దాడులంటూ పుకార్లు
☞ సంగం: రూ.3.5 లక్షల విలువ చేసే ఉత్సవ విగ్రహాల అందజేత