News November 24, 2024
నెల్లూరు: కన్నీరు పెట్టిస్తున్న వెల్లుల్లి ధరలు
నెల్లూరు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 నుంచి రూ.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 24, 2024
IPL వేలంపాటలో నెల్లూరు కుర్రాడు
క్రికెట్ ప్రియుల్ని ఉర్రూతలూగించే IPL బరిలో నెల్లూరు కుర్రాడు నిలవనున్నాడు. ఇవాళ జరిగే IPL వేలం పాటలో నెల్లూరుకు చెందిన అశ్విన్ హెబ్బర్ రూ.30లక్షల ప్రారంభ ధరతో వేలంలో నిలిచాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువతో ఆయన రాణించేవాడని స్థానికులు వెల్లడించారు. ఇవాళ లేదా రేపు అశ్విన్‌ను ఏ టీం తీసుకుంటుందో తేలనుంది. అతడిని ఏ టీం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయడి.
News November 24, 2024
ZP సర్వసభ్య సమావేశంలో ‘MLAల ఆగ్రహం’
శనివారం జరిగిన నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని శాఖల అధికారులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ప్రశ్నించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై మంత్రి ఆనం, కలెక్టర్ ఓ ఆనంద్‌కు వారు ఫిర్యాదు చేశారు.
News November 24, 2024
కందుకూరులో జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లను సందర్శన
నెల్లూరు జిల్లా కందుకూరు DSP ఆఫీస్, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు, VV పాలెం పోలీసు స్టేషన్లను శనివారం జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ల మ్యాప్, చార్ట్ ను, స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, శిథిలావస్థలో ఉన్న వాహనాలను పరిశీలించి, కోర్టు అనుమతితో వేలం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.