News March 29, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ నెల 30వ తేది ఆదివారం ఉదయం 9:00 గంటలకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలన్నారు. అధికారులందరూ తెలుగు సాంప్రదాయ దుస్తులతో హాజరై ఉగాది వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News April 2, 2025
నెల్లూరు : 3 నుంచి పది మూల్యాంకనం

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నగరంలోని దర్గామిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈవో బాలాజీ రావు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేపడుతున్నారని, సిబ్బంది నియామకాలను కూడా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 2 వతేదీ సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులకు, సిబ్బందికి విధులు కేటాయిస్తామన్నారు.
News April 2, 2025
రాష్ట్రంలోనే నెల్లూరుకు రెండో స్థానం

రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరాలలో రెండో స్థానంలో నెల్లూరు నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. కడప నగరం మొదటి స్థానంలో ఉంది. కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయని వెల్లడించింది.
News April 2, 2025
అనంతసాగరం: ఈతకెళ్లి యువకుడి మృతి.. జరిగిందిదే..!

అనంతసాగరం, మినగల్లుకు చెందిన మస్తాన్ బాష ఈతకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం స్నేహితులతో ఉత్తర కాలువలోకి వెళ్లాడు. ప్రవాహం అధికంగా ఉండడంతో..కొట్టుకుపోయాడు. సమాచారమందుకున్న పేరెంట్స్ గాలించినా దొరకకపోవడంతో..పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం ఉదయం గాలించగా..నన్లరాజుపాలెం సమీపంలో డెడ్ బాడీ లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.