News December 23, 2024
నెల్లూరు: జికా వైరస్ ఎఫెక్ట్.. పెద్దాస్పత్రిలో వార్డు ఏర్పాటు
నెల్లూరు ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జికా వైరస్ బాధితుల కోసం ముందస్తుగా వార్డును ఏర్పాటు చేశారు. మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఓ బాలుడికి జికా వైరస్ సోకినట్లు ముంబయిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించింది. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దాస్పత్రి పల్మనాలజీ విభాగంలోని ఒక ఫ్లోర్‌లో 5 పడకలతో ఒక వార్డును ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
Similar News
News December 23, 2024
బాలాయపల్లిలో ఎర్రచందనం దొంగ అరెస్ట్
మూడు ఎర్రచందనం దుంగలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్‌సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. బాలాయపల్లి మండలం గంగరాజుపల్లి సమీపంలోని సున్నపురాళ్ల కోన వద్దకు చేరుకోగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. విచారించగా అతని వద్ద మూడు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయని, అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
News December 23, 2024
NLR: పాపం.. బిర్యానీలో విషం పెట్టి చంపేశారు..!
అందరూ అయ్యో పాపం అనేలా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. సూళ్లూరుపేట గాండ్ల వీధి షార్ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. ఎవరో కావాలనే బిర్యానీలో విషం పెట్టి కుక్కలను చంపేశారని స్థానికులు చెబుతున్నారు. వాటితో ఇబ్బంది ఉంటే పట్టుకెళ్లి దూరంగా వదిలేయాలి కానీ.. ఇలా విషం పెట్టి చంపడం ఘోరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 23, 2024
నెల్లూరు: స్మార్ట్ మీటర్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు
నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు డబ్బులు చెల్లించనవసరం లేదని APSPDCL సర్కిల్ ఎస్ఈ విజయన్ తెలిపారు. ఉచితంగా మీటర్లను బిగిస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్లు కావాలనుకునే వారు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన రుసుం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది అదనంగా నగదు వసూలు చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.