News January 30, 2025

నెల్లూరు జిల్లాకు రానున్న మంత్రి ఫరూక్

image

న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి N.MD ఫరూక్ గురువారం నెల్లూరు జిల్లాకు రానున్నారు.  సాయంత్రం 4 గంటలకు ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో రానున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అనంతరం ఆయన మైనారిటీ శాఖ అధికారులతో  సమీక్ష నిర్వహించనున్నారు. 31న ఆయన తిరిగి నంద్యాలకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు.

Similar News

News April 24, 2025

మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం 

image

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.  

News April 24, 2025

నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

image

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 24, 2025

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరులో ర్యాలీ

image

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు వేర్వేరుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని కోరారు.

error: Content is protected !!