News April 11, 2024

నెల్లూరు జిల్లాలో 20.48 లక్షల మంది ఓటర్లు

image

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 20,48,252 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. వీరిలో 10,02,144 మంది పురుషులు, 10,45,917 మంది మహిళలు, 211 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించగా 7,932 పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 29, 2024

గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు

image

గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

News September 29, 2024

కలువాయి మండలంలో మరో సైబర్ క్రైం

image

కలువాయిలో ఆశా వర్కర్ ఖాతా నుంచి నగదు కొట్టేసిన ఘటన తెలిసిందే. అదే మండలంలోని ఉయ్యాలపల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న యస్. వెంకటరమణమ్మ ఖాతా నుంచి రూ.33,350 సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీ మొబైల్‌లో ఈ-సిమ్ యాక్టివేట్ అయ్యింది ప్రొఫైల్ ‘ON’ చేయమని మెసేజ్ వచ్చింది. దీనితో ఆమె ‘ON’ నొక్కగానే ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందని ఆమె తెలిపారు.