News June 4, 2024
నెల్లూరు జిల్లాలో టీడీపీ లీడ్
నెల్లూరు జిల్లాలో TDP ఆధిక్యత కనబరుస్తోంది. నెల్లూరు TDP ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. TDP అభ్యర్థులు నెల్లూరు సిటీలో నారాయణ, రూరల్‌లో కోటంరెడ్డి, ఉదయగిరిలో సురేశ్, గూడూరులో సునీల్, పేటలో విజయశ్రీ, కావలిలో కావ్య, కోవూరులో ప్రశాంతి రెడ్డి, వెంకటగిరిలో కురుగోండ్ల ముందంజలో ఉండగా.. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థి మేకపాటి లీడింగ్‌లో ఉన్నారు. సర్వేపల్లిలో హోరాహోరిగా సాగుతోంది.
Similar News
News January 3, 2025
నెల్లూరు: 44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గుంటూరు జోన్ పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నెల్లూరు DMHO V.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జోన్ పరిధిలో మొత్తం 44 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 సా.5 గంటల లోగా http://cfw.ap.nic.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 3, 2025
చంద్రబాబు పిలుపుతోనే టీడీపీలోకి: MP బీదమస్తాన్ రావు
రాజ్యసభ సభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీద మస్తాన్ రావుకు నెల్లూరు జిల్లా యాదవ సంఘం, యాదవ ఎంప్లాయిస్ అఫీషియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరానన్నారు. వైసీపీ ఓడిపోవడంతో తాను రాజ్యసభకు రాజీనామా చేసి హుందాగా వ్యవహరించానని అన్నారు.
News January 3, 2025
నెల్లూరులో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి పాఠశాలలో ఏడు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. SGT-2, SA గణితం-2, హిందీ-1, బయాలజికల్ సైన్స్-1, ఫిజికల్ సైన్స్-1 మొత్తం 7 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ పోస్టులను డైరెక్ట్ నియామకం ద్వారా భర్తీ చేస్తున్నామని అన్నారు.