News February 19, 2025

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 9వ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. తాను 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 3 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 8 కేంద్రాలను చెక్ చేసిందన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు. 51 మంది ప్రాక్టికల్స్‌కు రాలేదన్నారు.

Similar News

News February 21, 2025

నెల్లూరుకు చేరుకున్న మంత్రి నాదెండ్ల 

image

మంత్రి నాదెండ్ల మనోహర్ కాసేపటి క్రితం నెల్లూరకు చేరుకున్నారు. ఆయనకు టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌తోపాటూ పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తువాత నెల్లూరుకు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఆయన 22న సంగం మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 

News February 21, 2025

పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో మంత్రి ఆనం

image

రాపూరు మండలం పెంచల లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారితోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కుడిగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News February 21, 2025

నిన్ను మిస్ అవుతున్నా గౌతమ్: జగన్

image

ఇవాళ మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా నేను ప్రేమగా స్మరించుకుంటున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్’. అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

error: Content is protected !!