News December 30, 2024
నెల్లూరు: ‘తస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తారు’
నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో సోమవారం నుంచి నిర్వహించనున్న APSLRB పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతే ప్రమాణికంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిక్రూట్మెంట్కు వచ్చే అభ్యర్థులు సూచించిన ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావాలని ఎస్పీ కోరారు.
Similar News
News January 4, 2025
కోరిక తీర్చనందుకే మహిళ హత్య: కావలి DSP
కావలిలో ఈ నెల ఒకటో తేదీన అర్పిత బిస్వాస్ అనే మహిళను హత్య చేసిన నౌమౌన్ బిస్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్‌తో కలిసి మందు తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన అర్పితను అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు.
News January 4, 2025
దగదర్తి ఎయిర్‌పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. గతంలో జిల్లాలో దగదర్తి విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని కార్యాచరణను రూపొందించి 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన 745 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈప్రాంతంలో BPCL చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్‌ను తేవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.
News January 4, 2025
ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి: డీఎంహెచ్ఓ
వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పనిచేయాల్సిన వారు అక్కడే పని చేయాలని నెల్లూరు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిప్యూటేషన్లపై విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జీవో నం. 143 ద్వారా డిప్యూటేషన్‌పై ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.