News April 7, 2025
నెల్లూరు: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య(ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణ రావు ఓ ప్రకటనలో తెలిపారు. గత శుక్రవారమే కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ సుధీర్‌కు సమ్మె నోటీసు అందజేశామని చెప్పారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 18, 2025
నెల్లూరు: 26 మందికి రూ.74.57లక్షల పంపిణీ

నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి ఆర్థిక సహాయంతో నెల్లూరు జిల్లాకు చెందిన 26 మంది దివ్యాంగులకు రూ.74,57,500 చెక్కులను జాయింట్ కలెక్టర్ కార్తీక్ పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పనులు చేసుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ఏ.మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు.
News April 17, 2025
నెల్లూరు: 3.69 లక్షల ఎకరాలకు సాగునీరు

నెల్లూరు జిల్లాలో 3.69 లక్షల ఎకరాల రెండో పంటకు నీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నెల్లూరులోని జడ్పీ హాలులో ఐఏబీ సమావేశం జరిగింది. 41 టీఎంసీల జలాలను రెండో పంటకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ విషయంలో సాగునీటి సంఘాల ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
News April 17, 2025
PM ఇంటర్న్‌షిప్‌కు నమోదు చేసుకోండి: MP

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన కోరారు.