News December 25, 2024
నెల్లూరు: ప్రేమ పేరుతో మోసం.. 10 ఏళ్ల జైలుశిక్ష
ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడికి జైలుశిక్ష పడింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాశ్(23) ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదైంది. భానుప్రకాశ్‌తో అతడి బంధువులు వెంకటేశ్వర్లు(46), సుభాషిణి(40), స్వాతి(22), రమేశ్(29), మాలకొండయ్య(40)కు జడ్జి సిరిపిరెడ్డి సుమ పదేళ్ల జైలుశిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పుఇచ్చారు.
Similar News
News December 26, 2024
నెల్లూరు జిల్లాలో రూ.95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం
నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రూ.95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఈ కర్మాగారం ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు, ప్రత్యక్షంగాను, పరోక్షంగా పెరుగుతాయని, విద్యావంతులకు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి అపారమైన అవకాశాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 25, 2024
కనువిందు చేస్తున్న పులికాట్ సరస్సు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. దీంతో పులికాట్ సరస్సు జలకళను సంతరించుకుంది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సరస్సు అలల తాకిడి పర్యాటకుల్ని కనువిందు చేస్తోంది. కొన్నిచోట్ల విహంగాలు కూడా కనిపిస్తున్నాయి.
News December 25, 2024
NLR: 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జిల్లాలో 20,356 మంది ప్రిలిమినరీ పరీక్షలు రాయగా వారిలో 4,600 మందికిపైగా దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఈ పరీక్షలు ఈనెల 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్నారు.