News December 12, 2024

నెల్లూరు: ‘ప్రైవేటు భాగస్వామ్య వివరాలను తెలపండి’

image

భారత అంతరిక్ష రంగంలో గత ఐదేళ్లలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు అంశాలపై వివరాలను ఆయన ఆరా తీశారు. ఇస్రోతో భాగస్వామ్యం కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీల జాబితాను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Similar News

News December 27, 2024

నెల్లూరులో రూ.95 వేల కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు: MP   

image

రామాయపట్నం సమీపంలో రూ.95 వేల కోట్ల పెట్టుబడితో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ కంపెనీ ఏర్పాటు కానుండటం సంతోషమని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పారిశ్రామికంగా జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

News December 27, 2024

నెల్లూరు VR లా కాలేజీలో రెండు వ‌ర్గాలు పరస్పర దాడులు

image

నెల్లూరులోని VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర భౌతిక దాడులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దీంతో నెల్లూరు లా కాలేజీలో టెన్ష‌న్ వాతావరణం నెలకొంది. ఓ విద్యార్థినిపై వేధింపులే ఈ ఘర్షణకు కార‌ణం అని తెలుస్తోంది. లా విద్యార్థుల‌పై చెన్నై నుంచి వచ్చిన రౌడీలు దాడికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటనపై నెల్లూరు ఒకటో నగర పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

News December 27, 2024

నెల్లూరు: మరి కాసేపట్లో జిల్లా వ్యాప్తంగా వైసీపీ పోరుబాట 

image

కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీల బాదుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాన్యులపై వేలకోట్లు భారం మోపిన కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు.