News July 17, 2024

నెల్లూరు: యువకుడిపై దాడి..ట్విస్ట్ ఏంటంటే?

image

తడలో యువకుడిపై దాడి కలకలం రేపింది. తునికి చెందిన సతీశ్ కుమార్ శ్రీసిటీలో పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన మోనికకు పదేళ్ల క్రితం రవీంద్రబాబుతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయిన ఆమె తడకు వచ్చి 4 నెలలుగా సతీశ్‌తో సహజీవనం చేస్తోంది. సతీశ్ డ్యూటీకి వెళ్తుండగా ఒకరు ఇనుప రాడ్‌తో దాడి చేసి పారిపోయాడు. అతని ముఖ కవలికల ఆధారంగా రవీంద్రబాబునే దాడి చేశాడని మోనిక అనుమానిస్తోంది.

Similar News

News January 18, 2025

నెల్లూరు: ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇవి మిస్ కాకండి

image

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్‌లో అసలు మిస్ అవ్వకూడని ప్రదేశాలు ఏంటో ఓ లుక్ వేద్దాం.
☛సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి
☛ మన్నారుపోలూరు కృష్ణ స్వామి గుడి
☛ శ్రీహరికోట రాకెట్ కేంద్రం
☛ నర్సమాంబపురంలో ఎర్రకాళ్ల కొంగలు
☛ పులికాట్‌ ఫ్లెమింగోలు
☛భీములవారిపాళెం-ఇరకందీవి పడవ ప్రయాణం

News January 18, 2025

నెల్లూరు: ఇరిగేషన్‌లో రెగ్యులర్ ఎస్ఈల నియామకం

image

చాలా కాలంగా ఇన్‌ఛార్జ్‌ల పాలన కొనసాగుతున్న నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ సర్కిళ్లకు రెగ్యులర్ ఎస్ఈలు నియమితులయ్యారు. నెల్లూరు సర్కిల్ ఎస్ఈగా దేశా నాయక్, సోమశిల ప్రాజెక్టు ఎస్ఈగా రమణారెడ్డి, నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్ఈగా రాధాకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు దేశా నాయక్, రమణారెడ్డి అదే పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌‌లుగా ఉన్నారు.

News January 18, 2025

నెల్లూరు: 17 రోజుల్లో పది మంది మృతి

image

నెల్లూరు జిల్లాలో గడచిన 17 రోజుల్లో వివిధ కారణాలతో పదిమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమ విఫలమై, కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి, కొంతమంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా చిన్న చిన్న సమస్యలకే తనువు చాలించడం సరైంది కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక దృఢత్వం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.