News March 7, 2025

నెల్లూరు: విజయ డెయిరీపై టీడీపీ కన్ను

image

నెల్లూరులో కీలకమైన విజయ డెయిరీ ఛైర్మన్ పదవిపై టీడీపీ కూటమి కన్నేసింది. విజయ డెయిరీలో 15 మంది దైరెక్టర్లున్నారు. ఛైర్మన్‌గా 11 ఏళ్లుగా కొండ్రెడ్డి రంగారెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుతం మెజార్టీ డైరెక్టర్లు టీడీపీ వైపు ఉండటంతో ఛైర్మన్ పదవి కోసం పలువురు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. ఫైనల్‌గా ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో.

Similar News

News April 22, 2025

పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.

News April 22, 2025

నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

News April 21, 2025

చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

error: Content is protected !!