News March 11, 2025
నెల్లూరు: సరైన బిల్లులు లేని 4 కేజీల బంగారం స్వాధీనం

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు సీఐ కే.నరసింహారావు, DCTO కే. విష్ణు రావు తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3 కోట్ల 37 లక్షల విలువైన 4 కేజీల 189 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కారును జీఎస్టీ అధికారులకు అప్పగించారు.
Similar News
News March 12, 2025
నెల్లూరు: ANMల కౌన్సెలింగ్ వాయిదా

నెల్లూరు జిల్లాలో సచివాలయం ఏఎన్ఎంలు (గ్రేడ్-3)గా పనిచేస్తున్న 289 మందికి ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి సబ్ సెంటర్ల కేటాయింపునకు సంబంధించి మార్చి 13న నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. 17న నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర తెలిపారు. సీనియారిటీ సమస్యలు ఉత్పన్నం కాకుండా జోన్ పరిధిలోని జిల్లాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నామన్నారు.
News March 12, 2025
డా.N. యువరాజ్‌కు నెల్లూరు జిల్లా బాధ్యతలు

నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.
News March 12, 2025
CBI అంటూ రూ.1.02 కోట్ల లూటీ

CBI అధికారులమంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ.1.02కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడికి గత నెల 25న ట్రాయ్ అధికారులంటూ కొందరు ఫోన్ చేశారు. మీ సిమ్‌పై 85 ఫిర్యాదులు ఉన్నాయని, పలు నేరాలకు సిమ్‌ను వినియోగించారంటూ బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ.1,02,47,680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం PSలో ఫిర్యాదు చేశాడు.