News March 27, 2025

నెల్లూరు: హైవేపై ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి జాతీయ రహదారి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.  రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో అనంతసాగరం ఏసీ మెకానిక్ హమీద్ (29) తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Similar News

News April 1, 2025

హైదరాబాద్‌లోనే మాజీ మంత్రి కాకాణి..?

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది. 

News April 1, 2025

కాకాణి పారిపోలేదు: MLC

image

మాజీ మంత్రి కాకాణి కేసుల విషయమై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖ‌ర్‌రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గోవర్ధన్ రెడ్డి పారిపోయారని, అరెస్టు అయ్యారని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉగాది చేసుకోవటానికి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం నెల్లూరుకు వస్తారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలని ప్రభుత్వం చూస్తోంది’ అని అన్నారు.

News April 1, 2025

ఆకస్మిక తనిఖీలు చేయండి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ, సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టాల అమలుపై జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం తన ఛాంబర్‌లో మంగళవారం నిర్వహించారు. గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.

error: Content is protected !!