News February 28, 2025
నెల్లూరుకు ప్రముఖ సింగర్స్ రాక

కొడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ ఉదయ కాళేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి గొప్ప సంగీతవిభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ సునీత, సమీర భర్వదాజ్, హారికానారాయణ్ లతో జబర్దస్త్ టీం పాల్గొని సందడి చేయనుంది.
Similar News
News February 28, 2025
పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులు: జేసీ

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పిఎంఈజిపి రుణాల మంజూరు, క్లస్టర్ డెవలప్‌మెంటు ప్రోగ్రాం అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్ వివరించారు.
News February 28, 2025
నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలా చర్యలు: కలెక్టర్

రాబోయే ఆర్థిక సంవత్సరంలో మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ 2025-26 పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
News February 28, 2025
నెల్లూరు: నాడు ప్రేమ పెళ్లి సంచలనం.. నేడు విషాదం

రెండేళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా సంచలన రేపిన ప్రేమ వివాహం నేడు విషాదంతో ముగిసింది. పొదలకూరు(M), మర్రిపల్లికి చెందిన శివప్రియ అనే అమ్మాయిని నెల్లూరు రూరల్‌కి చెందిన నాగ సాయి అనే యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆ వివాహం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివప్రియ ఆత్మహత్య చేసుకుంది. భర్త నాగసాయి పోలీసులకు తెలియజేశారు.