News April 25, 2024

నెహ్రూ జూ పార్కులో నేటి నుంచి వేసవి శిబిరం

image

HYD నెహ్రూ జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి తెలిపారు. ఈ నెల 25 నుంచి జూన్ 30 వరకు కొనసాగుతుందన్నారు. నాలుగో తరగతి నుంచి పై విద్యార్థులకు జూకు సంబంధించిన జంతువులు, వాటి ఆవాసాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్నాక్స్ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 అని చెప్పారు.

Similar News

News November 14, 2024

HYD: అక్కడేమో పూజలు.. ఇక్కడేమో ఇలా..!

image

VKB అనంతగిరి కొండల్లో పుట్టిన మూసికి అక్కడికి వెళ్లిన పర్యటకులు పూలు చల్లి పూజలు చేసి, స్వచ్ఛమైన నీటితో దైవాభిషేకం చేస్తున్నారు. మరి అదే మూసీ.. VKB ప్రాంతంలో పూజలు చేసిన వారే.. HYDలో మూసీని చూడగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. PCB ప్రమాణాలకు మించి మూసీ కలుషితమైంది. దీంతో HYDలో 55KM మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది.

News November 13, 2024

HYD: సీపీ ఫోటోతో సైబర్ నేరగాళ్ల దందా.. జాగ్రత్త..!

image

HYD సీపీ ఆనంద్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఫేక్ నంబర్లతో కాల్ చేసి, అమాయక వ్యక్తులకు వలవేస్తున్నారు. దీనిపై స్పందించిన సీపీ.. డబ్బు, బ్యాంకు వివరాలు అడగటం కోసం, ఇతర పర్సనల్ సమాచారం అడగటానికి ఏ అధికారి కాల్ చేయరని, అలాంటి వాటిని నమ్మొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

News November 13, 2024

ఓయూలో త్వరలో సంస్కరణలు: వీసీ

image

తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు వీసీ ప్రొ.ఎం.కుమార్ వెల్లడించారు. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ హాజరు తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. VC బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఠాగూర్ ఆడిటోరియంలో అధ్యాపకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న న్యాక్ గుర్తింపులో ఉత్తమ రేటింగ్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.