News April 2, 2025
నేటి జగిత్యాల మార్కెట్ ధరలు…

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు గరిష్ఠ రూ. 2231, కనిష్ఠ రూ. 1860; పసుపు (కాడి) గరిష్ఠ రూ. 13001, కనిష్ఠ రూ. 6000; పసుపు (గోళ) గరిష్ఠ రూ. 11500, కనిష్ఠ రూ. 5500; కందులు గరిష్ఠ రూ. 6420, కనిష్ఠ రూ. 5789లుగా పలికాయి. ఈ రోజు మొత్తం 1341 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News April 4, 2025
తీవ్ర విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8 మంది మృతి

మధ్యప్రదేశ్ కొండవాట్‌లో విగ్రహాల నిమజ్జనం కోసం పాడుబడ్డ బావిని శుభ్రం చేసేందుకు వెళ్లి 8 మంది మరణించారు. గంగౌర్ పండుగ నేపథ్యంలో 150 ఏళ్ల బావిని శుభ్రం చేసేందుకు తొలుత ఓ కూలీ బావిలోకి దిగాడు. బావిలోని విషవాయువులు పీల్చి మునిగిపోతుండగా అతడిని కాపాడేందుకు మిగిలిన కూలీలు అందులోకి దిగారు. ఇలా మొత్తం 8 మంది ప్రాణాలు వదిలారు. వారికి ఈత వచ్చినా విషవాయువులు పీల్చి నీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.
News April 4, 2025
KMM:ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 16 లక్షల స్వాహా..

ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి రూ.16 లక్షలు కాజేసిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం వివేకానంద కాలనీకి చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి మామిళ్ళగూడెంకి చెందిన పలువురు యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రూ. 16 లక్షల పైగా మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు
News April 4, 2025
GNT: బీఈడీ కళాశాలల పనితీరుపై ఎన్సీటీఈ నోటీసులు

ANU పరిధిలోని 11 బీఈడీ కళాశాలలకు ఎన్సీటీఈ నోటీసులు జారీ చేసింది. గుంటూరు, నరసరావుపేట, రేపల్లె ప్రాంతాల్లోని కళాశాలల పనితీరు అంచనాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మార్చిలో ప్రశ్నపత్రం లీక్, ప్రయోగ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేయడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బీఈడీ కోర్సులో అవకతవకలను సమీక్షించడానికి ఈ నోటీసులు పంపింది.