News August 1, 2024
నేటి నుంచి డిప్లొమా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
డీఈఈ సెట్ లో అర్హత సాధించిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు 2024 -26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని డైట్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వాసంతి ప్రకటనలో తెలిపారు. హనుమకొండ లష్కర్ బజార్లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో గురువారం నుంచి ఆగస్టు 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News November 28, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.
News November 28, 2024
దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.
News November 27, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు పరిశీలించారు.