News May 31, 2024
నేటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది రోజులకు పైగా మూతబడి ఉన్న
థియేటర్లు శుక్రవారం తెరుచుకోనున్నాయి. ఈనెల 17 నుంచి సినిమా హాళ్లను మూసి ఉంచుతున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి మూతబడిన హాళ్లను తిరిగి తెరవాలని అసోసియేషన్ గురువారం నిర్ణయించడంతో నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని 30 థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు.
Similar News
News November 18, 2024
రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వానికి నివేదిక..!
స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరిస్తూ నివేదికను ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమీషన్ ఛైర్మన్ బూసాని వేంకటేశ్వర రావు అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ జరిగింది.
News November 17, 2024
కలెక్టర్‌ను తనిఖీ చేసిన పోలీసులు
కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్, సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాలో గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది కలెక్టర్‌ను సైతం తనిఖీలు నిర్వహించి లోపలకి అనుమతించారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులను కలెక్టర్ అభినందించారు.
News November 17, 2024
ఖమ్మం: విద్యార్థికి గుండు కొట్టించిన Asst ప్రొఫెసర్
ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థికి Asst ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 12న ములుగు జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి చైనీస్ స్టైల్లో కటింగ్ చేయించుకున్నాడు. దీంతో అతడి హెయిర్ స్టైల్ చూసి సీనియర్ విద్యార్థులు హేళన చేశారు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న ఓ Asst ప్రొఫెసర్ అతడిని కటింగ్ షాప్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు.