News February 25, 2025
నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్‌లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు
Similar News
News February 26, 2025
నంద్యాల జిల్లాకు జబర్దస్త్ నటుడి రాక

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో పాటు, పలు నాటక ప్రదర్శనలు, సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రజలను మెప్పిస్తున్న జబర్దస్త్ నటుడు అప్పారావు నేడు (బుధవారం) కొలిమిగుండ్ల మండలం పెట్నికోటకు రానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెట్నికోట శ్రీ గుండు మల్లేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో అప్పారావు సుబ్బిశెట్టి పాత్ర వేస్తున్నారు.
News February 26, 2025
నెల్లూరులో శివరాత్రి శోభ.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, నెల్లూరులోని శైవక్షేత్రాలన్నీ విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి. బుధవారం శివరాత్రి సందర్భంగా నగరంలోని మూలాపేట, నవాబుపేట, గణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీరబ్రహ్మేంద్రస్వామి తదితర శైవ క్షేత్రాలలో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
News February 26, 2025
శివరాత్రి ఉత్సవాలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

అనంతపురం జిల్లాలో ఇవాళ (బుధవారం) శివరాత్రి ఉత్సవాలు జరగనున్న ప్రధాన శివాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజలందరు శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఆలయాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తే ఏ ఇబ్బందీ లేకుండా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని వెల్లడించారు.