News November 11, 2024

నేడు HYDలో వాటర్ బంద్

image

రాజధాని వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్‌ పైప్‌లైన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట్, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. SHARE IT

Similar News

News November 14, 2024

TET & DSC అభ్యర్థులకు ఫ్రీ గ్రాండ్ టెస్టుల నిర్వహణ

image

తెలుగు రాష్ట్రాల్లో TET & DSC అభ్యర్థులకు అద్భుత అవకాశం. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్‌ వారు నవంబరు 17 నుంచి ప్రతి ఆదివారం జిల్లాల వారీగా మొబైల్ యాప్‌లో ఫ్రీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమ జిల్లాల వారీగా మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధినేత సిరికొండ లక్ష్మినారాయణ సూచించారు.

News November 14, 2024

HYD‌లో కిలో చికెన్ రూ.162

image

HYDలో చికెన్ ధరలు‌ భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గతవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. గురువారం స్కిన్ లెస్ KG రూ. 185, విత్ స్కిన్ రూ. 162కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
SHARE IT

News November 14, 2024

HYD: రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్

image

గ్రేటర్ HYD పరిధిలోని పలు రెస్టారెంట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. మొఘల్ రెస్టారెంట్, డైన్‌హిల్ మండి రెస్టారెంట్లలో చికెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. పాడైపోయిన మాంసాన్ని, ఫ్రిడ్జ్‌లతలో నిల్వ చేసినట్లు గుర్తించాం అన్నారు. హోటల్ నిర్వహణ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.