News October 19, 2024
నేడు అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఉ. 10.30 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. వ్యవసాయం, రహదారులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Similar News
News January 3, 2025
తాడిపత్రిలో నటి మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు
తాడిపత్రిలో సినీ నటి మాధవీ లతపై రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. గత నెల 31న జేసీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీ లత తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News January 3, 2025
రాష్ట్రస్థాయిలో ధర్మవరం బాలికలకు ద్వితీయ స్థానం
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇంటర్, స్కూల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్‌లో ధర్మవరం బాలికల జట్టు రాణించి రన్నర్స్‌గా (ద్వితీయ స్థానం) నిలించింది. ఈ మేరకు అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి గురువారం తెలిపారు. గత నెల 28, 29, 30వ తేదీలలో చిత్తూరులో జరిగిన టోర్నమెంట్‌లో ధర్మవరం జట్టుపై బంగారుపాలెం జట్టు 2 పాయింట్లతో గెలిచి మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు.
News January 3, 2025
శ్రీ సత్యసాయి: పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.